Hyderabad Airport | హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. నెల వ్యవధిలో 23వ బెదిరింపు కాల్‌

Feb 18, 2026 - 19:30
 0  0
Hyderabad Airport | హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. నెల వ్యవధిలో 23వ బెదిరింపు కాల్‌
Hyderabad Airport

హైదరాబాద్‌ : నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టారు.

కానీ బాంబు లభ్యం కాలేదు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0