Mollywood Times | ప్రేమలు హీరో ‘మాలీవుడ్ టైమ్స్’.. రిలీజ్ డేట్ ఖరారు చేసిన మేకర్స్

‘ప్రేమలు’, ‘లోక’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ యువ హీరో నస్లేన్ గఫూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times). ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ వంటి వైవిధ్యమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ సుందర్ నాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నస్లేన్ ‘వినీత్ మాధవన్’ అనే పాత్రలో నటించబోతున్నాడు. ఈ పాత్ర ఆస్కార్ అవార్డును గెలవాలని కలలు కనే ఒక ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ పాత్ర అని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 14న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
#MollywoodTimes Release announcement posters. #Naslen pic.twitter.com/8BoX6hnuPA
— Abhinav Sunder Nayak (@abhinavsnayak) February 14, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0