సంత్‌ సేవాలాల్‌ కృషి మరువలేనిది.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Feb 18, 2026 - 19:29
 0  0
సంత్‌ సేవాలాల్‌ కృషి మరువలేనిది.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
Ktr

ఖానాపూర్‌, ఫిబ్రవరి 15 : గిరిజనుల అభ్యున్నతికి సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ చేసిన కృషి మరువలేనిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్‌ నాయక్‌ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి జాన్సన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఆధ్యాత్మికంగా, సామాజికంగా గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు సేవాలాల్‌ అని కొనియాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ఆశీస్సులతో గిరిజన సమాజం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0