శంకరయ్యను అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

Feb 18, 2026 - 19:29
 0  0
శంకరయ్యను అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం
01
  • మీడియాతో కుటుంబ సభ్యులు

షాబాద్‌, ఫిబ్రవరి 15 : మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌ 8వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌గా గెలుపొందిన మంచి శంకరయ్యను కాంగ్రెస్‌ నాయకులు కిడ్నాప్‌ చేశారు. ఆదివారం అజీజ్‌నగర్‌లో శంకరయ్య సోదరులు పోచయ్య, సత్తయ్య వారి కుటుంబీకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు ఎత్తుకుపోయిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మంచి శంకరయ్యను వెంటనే తమకు అప్పగించాలని, లేకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. శంకరయ్య గెలుపొందడటంతో తాము సంబురాలు చేసుకుందామనే తరుణంలోనే.. ఆయనను కాంగ్రెస్‌ శ్రేణులు ఎత్తుకుపోయారని ఆరోపించారు. తాము 25 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని.. ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదని పేర్కొన్నారు. శంకరయ్యను తమకు అప్పజెప్పాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమవుతుందని వాపోయారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0