WI vs NEP | విజృంభించిన హోప్, హోల్డర్.. సూపర్‌ 8లో వెస్టిండీస్, నేపాల్ ఔట్..!

Feb 18, 2026 - 19:30
 0  0
WI vs NEP | విజృంభించిన హోప్, హోల్డర్.. సూపర్‌ 8లో వెస్టిండీస్, నేపాల్ ఔట్..!
Wi

WI vs NEP : పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో వెస్టిండీస్(West Indies) సూపర్- 8 చేరింది. లీగ్ దశ మూడో మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి నాకౌట్ దశకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. జేసన్ హోల్డర్(4-27) విజృంభణతో ప్రత్యర్థిని కట్టడి చేసిన విండీస్.. ఆపై స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడేసింది. కెప్టెన్ షాయ్ హోప్(61 నాటౌట్), షిమ్రన్ హిట్‌మైర్ (46 నాటౌట్)లు దంచేయడంతో 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారీ విజయం.. మెరుగైన రన్‌రేటుతో కరీబియన్ జట్టు సాధించి సూపర్8లో అడుగుపెట్టగా.. నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పొట్టి ప్రపంచకప్‌లో జోరు చూపిస్తున్న వెస్టిండీస్ ఈమధ్యే తమపై సిరీస్ గెలుపొందిన నేపాల్‌ను చిత్తుగా ఓడించింది. 15.2 ఓవర్లలోనే లక్ష్య ఆన్ని చేరుకొని అన్నింటికంటే ముందే సూపర్ 8 దశకు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచుల్లో భారీ విజయాలతో టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన విండీస్… ఆదివారం వాంఖడేలో పాల్‌పై 9 వికెట్ల గెలుపుతో నాకౌట్‌కు అర్హత సాధించింది. సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(4-27) ధాటికి నేపాల్ బ్యాటర్లు విలవిలలాడారు.

ఛేదనలో విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్‌(22), షాయ్ హోప్‌(61 నాటౌట్)లు చితక్కొట్టారు. తొలి వికెట్‌కు 44 పరుగులతో శుభారంభిమిచ్చిన ఈ ద్వయాన్ని నందన్ యాదవ్ విడదీసి.. నేపాల్‌కు బ్రేకిచ్చాడు. కానీ, షిమ్రన్ హిట్‌మైర్(46 నాటౌట్) జతగా హోప్ చెలరేగిపోయాడు. వీరిద్దరూ విధ్వంసక ఆటతో నేపాల్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేశారు. ఇంకేముంది.. 15.2 ఓవర్లలోనే వెస్టిండీస్ 9 వికెట్లతో జయభేరి మోగించింది.

దీపేంద్ర ఒక్కడే..

వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో వెస్టిండీస్‌పై రెచ్చిపోయిన నేపాల్ ఆటగాళ్లు మెగా టోర్నీలో మాత్రం నిరాశపరిచారు. బోణీ కొట్టాలంటే నెగ్గాల్సిన మ్యాచ్‌లో ప్రత్యర్ధి బౌలర్లకు దాసోహమయ్యరు. జేసన్ హోల్డర్(4-27) సంచలన బౌలలింగ్‌తో వికెట్ల వేట కొనసాగించగా.. నేపాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు.. 46కే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 133 రన్స్ చేసిందంటే దీపేంద్ర ఐరీ(58) చలవే. సహచరులు విఫలమైనా అతడు హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో సోంపాల్ కమి(26 నాటౌట్) మెరుపులతో పోరాడగలిగే స్కోర్ చేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0