Swayambhu Teaser | సాంకేతిక సమ‌స్య.. హై క్వాలిటీ HDRతో ‘స్వయంభు’ టీజర్‌ని మ‌ళ్లీ వ‌దిలిన మేక‌ర్స్‌

Feb 18, 2026 - 19:30
 0  0
Swayambhu Teaser | సాంకేతిక సమ‌స్య.. హై క్వాలిటీ HDRతో ‘స్వయంభు’ టీజర్‌ని మ‌ళ్లీ వ‌దిలిన మేక‌ర్స్‌
Swayambhu

Swayambhu Teaser | యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే డిజిటల్ రిలీజ్ సమయంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపం కారణంగా, ప్రేక్షకులకు నాణ్యమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ టీజర్‌ను తాజాగా ‘సినిమాస్కోప్’ వ్యూ మరియు ‘రీస్టోర్డ్ HDR’ క్వాలిటీతో మళ్ళీ విడుదల చేసింది. క్రీస్తుశకం 985 నాటి చారిత్రక అంశాలతో, ముఖ్యంగా ‘సెంగోల్’ (రాజదండం) ప్రాముఖ్యత చుట్టూ సాగే ఈ కథలో నిఖిల్ ఒక శక్తివంతమైన యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు హీరో నిఖిల్ స్వయంగా ప్రకటించారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా, ‘బాహుబలి’, ‘RRR’ ఫేమ్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ‘KGF’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 13నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా వాయిదా పడింది. “మనం ఎంత కాలం తీశామన్నది కాదు, ఎంత పర్‌ఫెక్ట్‌గా తీశామన్నదే ముఖ్యం” అని నిఖిల్ పేర్కొంటూ, ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0