Nallagonda | ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పూజలు

Feb 18, 2026 - 19:30
 0  0
Nallagonda | ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పూజలు
Komati

నల్లగొండ: వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయాల్లో పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

11-12వ శతాబ్దాలకు చెందిన ఈ దేవాలయాల్లో అద్భుత శిల్పకళ ప్రతిభ ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎల్లప్పుడూ ఒకే విధంగా నీడ కనిపించడం విశేషమని అన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0