Nagabandham | మహేష్ బాబు చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ లాంచ్.. మైథలాజికల్ వండర్‌గా మూవీ

Feb 18, 2026 - 19:30
 0  0
Nagabandham | మహేష్ బాబు చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ లాంచ్.. మైథలాజికల్ వండర్‌గా మూవీ
Nagabandham

టాలీవుడ్‌లో మరో భారీ మైథలాజికల్ అడ్వెంచర్ రాబోతుంది. ‘నాగబంధం’ అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా.. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం’ టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశాడు అగ్ర క‌థానాయ‌కుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహాశివరాత్రి సందర్భంగా ఈ టీజ‌ర్‌ను విడువ‌ల చేసి చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. ఇది కేవలం రాసుకున్న కథ కాదని, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ లేని ఒక అద్భుతమైన గాథ అని తెలిపారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం, పూరీ జగన్నాథ ఆలయాల్లోని నిగూఢ రహస్యాలు, వాటిని రక్షించే ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక శక్తుల నేపథ్యంతో 1750 కాలంలో సాగే కథగా ఇది తెరకెక్కుతుంద‌ని తెలిపాడు.

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, మురళీ శర్మ, ‘KGF’ ఫేమ్ గరుడ రామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కేవలం క్లైమాక్స్ సీక్వెన్స్ కోసమే మేకర్స్ 20 కోట్ల రూపాయలతో భారీ సెట్ నిర్మించడం విశేషం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0