Municipal Elections | నేను పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వండి.. ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

Feb 18, 2026 - 19:30
 0  0
Municipal Elections | నేను పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వండి.. ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి
Muduchinthalapalli

Municipal Elections | మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.

మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.జ్యోతి ఓడిపోయారు. దీంతో ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు. జ్యోతి తీరుపై స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. అసలు చీరలు ఎవరు ఇవ్వమన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 


ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ 9వ డివిజన్‌ ఎన్నికల్లో ఓడిన బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి, అతని భార్య రూప తమకు ఎవరు ఎవరు ఓటేశారో తెలుసుకునేందుకు ఒక బుక్‌ పట్టుకుని బయల్దేరారు. అలా ఇంటింటికీ తిరుగుతూ ఎవరెవరూ తనకు ఓటు వేశారో లెక్కలు రాసుకుంటున్నారు. తనకు ఓటు వేయని వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని వసూలు చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0