Mumbai Metro Slab Collapse | మెట్రో స్లాబ్ కూలిన ఘటనలో ఐదుగురు అరెస్ట్‌.. కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు జరిమానా

Feb 18, 2026 - 19:30
 0  0
Mumbai Metro Slab Collapse | మెట్రో స్లాబ్ కూలిన ఘటనలో ఐదుగురు అరెస్ట్‌.. కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు జరిమానా
Mumbai Metro Pillar

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మెట్రో స్లాబ్‌ కూలిన సంఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కాంట్రాక్టర్లకు రూ.6 కోట్ల జరిమానా విధించింది. (Mumbai Metro Slab Collapse) నిర్మాణ సంస్థకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం మధ్యాహ్నం ములుండ్‌లోని ఆర్టరీ ఎల్‌బిఎస్ మార్గ్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్ స్లాబ్ ఊడింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో, ఒక కారుపై ఆ భారీ స్లాబ్‌ పడింది. ఒక వివాహానికి వెళ్తున్న స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత, గ్రామ పెద్ద రామ్‌ధన్ యాదవ్ ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యజీత్ సాల్వేను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్‌ సంస్థలైన మిలన్ రోడ్ బిల్డ్‌టెక్, లూయిస్ బెర్గర్‌లపై రూ.6 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు. భద్రతా, నిర్మాణపరంగా మొత్తం మెట్రో మార్గాన్ని సమగ్రంగా ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యాదవ్ కుటుంబానికి పరిహారాన్ని రూ.15 లక్షలకు పెంచినట్లు షిండే వెల్లడించారు.

మరోవైపు ముంబై పోలీసులు కూడా ఈ ప్రమాదంపై చర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థ మిలన్ రోడ్ బిల్డ్‌టెక్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను, డీబి హిల్ ఎల్‌బీజీ సూపర్‌వైజరీ కంపెనీకి చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ హరీష్ చౌహాన్, ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు అరెస్టైన వారిలో ఉన్నట్లు వివరించారు.

Also Read:

Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు

Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్‌ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు

Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0