Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు

Feb 18, 2026 - 19:30
 0  0
Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు
Policevan

న్యూఢిల్లీ: భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు ఇది చూశారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు తండ్రిని పట్టించారు. (Man Kills Wife) దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన 39 ఏళ్ల అనిల్‌ చున్నీతో 35 ఏళ్ల భార్య గొంతునొక్కి చంపాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 10, 13 ఏళ్ల కుమారులు ఇది చూశారు.

కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి గొడవ పడిన తండ్రి తమ తల్లిని చంపినట్లు ఇద్దరు కుమారులు పోలీసులకు చెప్పారు. దీంతో అనిల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Anil Vij | ‘నా ఆదేశాన్ని పాటించాలి’.. మహిళా పోలీస్‌ అధికారిణిపై మంత్రి ఆగ్రహం

teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్‌.. వాలంటైన్స్‌ డే రోజున యువకుడు ఆత్మహత్య

Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి

Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0