KCR Birthday | కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Feb 18, 2026 - 19:30
 0  0
KCR Birthday | కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Kcr Birthday

హైదరాబాద్‌ : ఈ నెల 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ( KCR Birth Day ) ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వెల్లడించారు.

తెలంగాణ భవన్‌లో ఇన్‌చార్జి రావుల చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, కిషోర్ గౌడ్, ముఠా జయసింహతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు.  కరెంట్, నీళ్లు గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ , పేదలకు ఆసరా పింఛన్లు, విద్యార్థులకు గురుకులాలను, రైతులకు , ప్రజలకు సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలను నిర్వహిస్తున్నామని వివరించారు.

17 న కేసీఆర్ బర్డ్‌డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేక్ కటింగ్ కార్యాక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు. న్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి ధీటుగా ప్రతి పక్ష బీఆర్‌ఎస్‌కు ఓట్లు వచ్చాయని అన్నారు.KCR,

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0