hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్‌ హవాలా రాకెట్‌.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌

Feb 18, 2026 - 19:30
 0  0
hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్‌ హవాలా రాకెట్‌.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌
Digitalarrest

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన 8,000 బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి. (hawala racket busted) జమ్ముకశ్మీర్‌లో భారీ ‘ములే’ ఖాతాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ ఖాతాల్లోకి చేరు డబ్బు చివరికి వేర్పాటువాదం లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత మూడ్లేళుగా జమ్ముకశ్మీర్‌లో సుమారు 8,000కు పైగా ఇలాంటి బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్‌ చేశారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోకి అక్రమ ఆర్థిక నిధులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2017లో అణిచివేత చర్యలు ప్రారంభించింది. ఆర్థిక మోసాల గొలుసులో సహాయకారిగా వ్యవహరించే మధ్యవర్తులను ‘ములర్లు’ అని పిలుస్తారని గుర్తించింది.  ‘డిజిటల్ హవాలా’ వ్యవస్థగా వ్యవహరించే ఈ నెట్‌వర్క్‌ వైపు ‘ములర్లు’ మొగ్గు చూపుతున్నారని ఎన్‌ఐఏ అనుమానించింది.

మరోవైపు దేశానికి ముప్పుగా మారే ‘ములే’ ఖాతాల విస్తరణను అరికట్టడానికి బ్యాంకులతో కలిసి పనిచేయాలని జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఇతర సంస్థలను జాతీయ దర్యాప్తు సంస్థలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించి వాటిని స్తంభింపజేస్తున్నారు.

Also Read:

Mumbai Metro Slab Collapse | మెట్రో స్లాబ్ కూలిన ఘటనలో ఐదుగురు అరెస్ట్‌.. కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు జరిమానా

Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు

Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0