chemical factory explosion | కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Feb 18, 2026 - 19:30
 0  0
chemical factory explosion | కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
Explosion At Karnataka Chem

బెంగళూరు: కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (chemical factory explosion) కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2022లో కీర్తి కెమికల్స్ నుంచి విషపూరిత వాయువు లీకేజీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగడంతోపాటు పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారుల జోక్యంతో ఫ్యాక్టరీని మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.

కాగా, చాలా కాలంగా పని చేయని ఈ కెమికల్‌ ఫ్యాక్టరీలోని సామగ్రిని వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రసాయన ట్యాంక్‌ తొలగించేందుకు ప్రయత్నించగా పేలుడు జరిగింది. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన కార్మికులు బీహార్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Mumbai Metro Slab Collapse | మెట్రో స్లాబ్ కూలిన ఘటనలో ఐదుగురు అరెస్ట్‌.. కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు జరిమానా

hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్‌ హవాలా రాకెట్‌.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌

Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు

Watch: వాలంటైన్స్‌ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0