Bharat Mela | కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా భారత్ మేళా సంబురాలు

Feb 18, 2026 - 19:30
 0  0
Bharat Mela | కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా భారత్ మేళా సంబురాలు
Kuwait Festival

కువైట్‌ ( Kuwait ) లోని భారత ( India ) రాయబార కార్యాలయం, టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ (TEC)తో కలిసి భారత్ మేళా- 2026ను అరేబియన్ గల్ఫ్ రోడ్‌లోని గ్రీన్ ఐలాండ్ బీచ్‌లో భారత్‌ మేళాను ( Bharat Mela ) ఘనంగా నిర్వహించారు.

భారతీయ కమ్యూనిటీ సభ్యులు, దౌత్యవేత్తలు, కువైట్‌తో సహా వివిధ దేశాలకు చెందిన జాతీయులు పండుగకు హాజరయ్యారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, వంటకాలు , కళాత్మక వారసత్వం వేడుకను అంబాసిడర్ పరమిత త్రిపాఠి ( Paramita Tripathi ) జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

Bharat Mela11

ఆమె మాట్లాడుతూ భారతదేశం, కువైట్ మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో సాంస్కృతిక వారసత్తం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో , ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో భారతీయ సమాజం పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఆమె ప్రశంసించారు.

Bharat Mela12

సంబరాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల భారతీయ ప్రాంతీయ ఆహారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శాస్త్రీయ , జానపద నృత్యాలు, సంగీతం, యోగా, యుద్ధ కళలతో సహా 7వందల మంది కళాకారులతో 57 ప్రత్యక్ష ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం సాంస్కృతిక ఉత్సవం మాత్రమే కాకుండా, భారత్ మేళా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని కువైట్ సమాజానికి అందిస్తూ, సమాజాల మధ్య అర్ధవంతమైన వారధిగా పనిచేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0