Allu Sirish | అల్లు వారింట పెళ్లి సందడి మొదలు… తొలికార్డ్ చిరంజీవికి అందించిన మెగా ఫ్యామిలీ

Feb 18, 2026 - 19:30
 0  0
Allu Sirish | అల్లు వారింట పెళ్లి సందడి మొదలు… తొలికార్డ్ చిరంజీవికి అందించిన మెగా ఫ్యామిలీ
Chiru

Allu Sirish | అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకల హడావిడి మొదలైంది. యువ నటుడు అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గత అక్టోబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో ప్రీ–వెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకోవడంతో వారి పెళ్లి వార్తలు మరింత హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అధికారికంగా పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పసుపు కార్యక్రమంతో శుభారంభం చేసినట్లు అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా పెళ్లి పత్రికల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.

తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను కుటుంబ పెద్దలకు అందించడం ఆనవాయితీ. అదే విధంగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కొణిదెల దంపతులకు తొలి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య, అత్తయ్యలకు అందించాం” అని పేర్కొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ వర్గాల్లో కూడా ఈ వివాహం గురించి చర్చ కొనసాగుతోంది.

సమాచారం ప్రకారం అల్లు శిరీష్–నయనికల వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. మొత్తానికి అల్లు ఇంట పెళ్లి సందడి మొదలై, అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.

Allu1

Allu1

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0