Alex Stein | హిందూ విశ్వాసాలపై జోకులు.. అమెరికా కమెడియన్‌పై నెటిజన్ల ఫైర్

Feb 18, 2026 - 19:30
 0  0
Alex Stein | హిందూ విశ్వాసాలపై జోకులు.. అమెరికా కమెడియన్‌పై నెటిజన్ల ఫైర్
Alex Stein

Alex Stein : హిందూ మత విశ్వాసాలపై జోక్స్ వేస్తూ కించపరిచిన అమెరికన్ కమెడియన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇది అతడి జాత్యాహంకార మనస్తత్వానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇటీవల అమెరికా, టెక్సాస్‌లో ప్లానో సిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఇండియన్-అమెరికన్ పౌరులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి కన్జర్వేటివ్ యూట్యూబర్, కమెడియన్ అయిన అలెక్స్ స్టెయిన్ కూడా హాజరయ్యాడు.

అతడు పసుపు రంగు కుర్తా, నలుపు రంగు షార్ట్స్, బొట్టు ధరించి ఈ కార్యక్రమానికి వచ్చాడు. తన ప్రసంగంలో భాగంగా హిందూ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. గోమూత్రం, ఆవు పేడ, ఔషధం అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతేకాదు.. తనను తాను యంగ్ ఇండియన్ బాయ్ అంటూ చెప్పుకొన్నాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారతీయులు గర్వపడాలని చెప్పిన అలెక్స్.. కాష్ పటేల్ వ్యక్తిగత జీవితంపై కూడా జోకులు వేశాడు. ఇలా భారతీయుల్ని కించపరుస్తూ, ఎందరో హిందువులు పవిత్రంగా భావించే గోవును కించపరిచేలా అతడు వ్యాఖ్యలు చేయడం అక్కడి అతిథుల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేసింది.

చాలా మంది ఇండో-అమెరికన్స్ ఆ సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయారు. అతడి వ్యాఖ్యలు సరికావని వారు విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. భారతీయులపై అలెక్స్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సాధారణమేని, ఇది అతడి వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. అలెక్స్ వంటి ఫెయిల్డ్ కమెడియన్‌ వ్యాఖ్యలు సరదాగా పరిగణించకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0