Airlines regulations | విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసేవారికి కేంద్రం హెచ్చరిక.. వీడియో బ్లాగర్లకు కూడా

Feb 18, 2026 - 19:30
 0  0
Airlines regulations | విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసేవారికి కేంద్రం హెచ్చరిక.. వీడియో బ్లాగర్లకు కూడా
Azerbaijan Airlines

Airlines regulations : విమానంలో ప్రయాణించేవారికి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విమానంలో నిబంధనలు పాటించని ప్రయాణికులపై తీసుకునే చర్యలపై పార్లమెంట్‌లో నమక్కల్ ఎంపీ వీఎస్ మాతేశ్వరన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు. ఈ అంశంలో డీజీసీఏ ఇప్పటికే 1937, ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ రూపొందించిందన్నారు.

విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై నియమావళి ఉందన్నారు. దీని ప్రకారం.. విమానంలో లౌడ్ మ్యూజిక్ లేదా సౌండ్స్ ప్లే చేస్తే శిక్షించేలా ప్రత్యేక చట్టం అంటూ ఏదీ లేదన్నారు. అయితే, విమానంలో ప్రయాణికులు లేదా సిబ్బంది భద్రతకు ఇబ్బంది కలిగించే చర్యలకు లేదా వారికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా ఇలా లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి ఇబ్బంది కలిగించిన వారిపై కొన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ శబ్దంతో ఏదైనా మ్యూజిక్, ఇతర సౌండ్ ప్లే చేయకూడదు. అనుచితంగా ప్రవర్తించే అలాంటివారి ప్రయాణాన్ని విమాన సంస్థలు రద్దు చేయవచ్చు. విమానంలోకి అనుమతించరు. విమానంలో ఇబ్బంది కలిగిస్తే విమానం నుంచి దించేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ విషయంలో ప్రయాణికులు ఎయిర్‌ క్రాఫ్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే.

అయితే, విమానంలో అప్పుడప్పుడూ ప్రయాణికులకు సూచనలు ఇచ్చేముందు ఆయా సంస్థలు సాఫ్ట్ మ్యూజిక్ వంటివి ప్లే చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు మాత్రం తమ మొబైల్ డివైజెస్ లేదా ఇతర డివైజెస్ వంటివి వాడేటప్పుడు లౌడ్ మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఇయర్ ఫోన్స్ వాడాల్సిందే. ఇక విమానంలో ఫొటోలు, వీడియోలు తీసే వీడియో బ్లాగర్లకు కూడా కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయకూడదని సూచించింది. ఇందుకోసం ముందుగానే రాతపూర్వక అనుమతి తీసుకోవాలని కోరింది. విమానంలో మర్యాదపూర్వకంగా అందరూ ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ నియమాల్ని కేంద్రం అమలు చేస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0