Actor Vijay | ఎవరితో పొత్తులుండవ్‌.. సొంతంగా గెలువబోతున్నాం : టీవీకే చీఫ్‌ విజయ్‌

Feb 18, 2026 - 19:30
 0  0
Actor Vijay | ఎవరితో పొత్తులుండవ్‌.. సొంతంగా గెలువబోతున్నాం : టీవీకే చీఫ్‌ విజయ్‌
Actor Vijay

Actor Vijay : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలు మొదలుపెట్టాయి. అక్కడ సాధారణంగా డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే ఇందుకు కారణం.

తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీని స్థాపించిన విజయ్… అధికార డీఎంకేను కూల్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములైన ఎన్డీయే, యూపీయేతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, సంప్రదాయ పార్టీలైన రెండు వ్యతిరేక పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు.

ఎన్నికల తర్వాత కూడా తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని స్పష్టంచేశారు. ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0