‘న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి’

Feb 18, 2026 - 19:29
 0  0
‘న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి’
'న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి'

– ఐఎల్‌పీఏ రాష్ట్ర నాయకుడు కట్టెల శివ

రామగిరి, ఫిబ్రవరి 16 : న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఐ ఎల్ పి ఏ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ డిమాండ్ చేశారు. అత్తాపూర్‌లో జ‌రిగిన న్యాయవాది ఖదీర్ హత్యను ఆయ‌న తీవ్రంగా ఖండించారు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం న్యాయవాదుల భద్రతా చట్టం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఇంతవరకు న్యాయవాదుల ర‌క్ష‌ణ‌ చట్టం తేకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అత్తాపూర్‌లో అడ్వకేట్ మహ్మద్‌ ఖదీర్ తన సొంత ఆఫీసులోనే దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0