ఫీజులు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌

Feb 18, 2026 - 19:29
 0  0
ఫీజులు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌
Hyd3
  • రామంతాపూర్‌ హోమియో వైద్య కళాశాలలో దోపిడీ
  • అల్లోపతి కంటే రెట్టింపు స్థాయిలో ఫీజులు వసూళ్లు
  • ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టారాజ్యంగా పెంపుదల
  • అవకతవకలపై దర్యాప్తు చేయాలని విద్యార్థుల డిమాండ్‌

“రామంతాపూర్‌ జేఎస్‌పీఎస్‌ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. అల్లోపతి కంటే రెట్టింపు స్థాయిలో వసూలు చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. పాలకుల అవినీతి, వైద్య, ఆరోగ్యశాఖ చేతగానితనం, ఆయుష్‌ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలను పేపర్‌ మీద చూపించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో 128 యూజీ సీట్లు, 38 పీజీ సీట్లు ఉన్నాయి. యూజీ విద్యార్థులకు నాలుగున్నర సంవత్సరాలకు గాను రూ.29వేలు, పీజీ విద్యార్థులకు మూడు సంవత్సరాలకు గాను రూ.49,500 చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు.”
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ):

రామంతాపూర్‌ జేఎస్‌పీఎస్‌ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో రెట్టింపు స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ అల్లోపతి పీజీ వైద్య విద్యార్థుల ఫీజు రూ.25వేలు మాత్రమే ఉండగా, రామంతాపూర్‌ జేఎస్‌పీఎస్‌ హోమియో వైద్యకళాశాలలో యూజీ విద్యార్థుల నుంచి రూ. 29వేలు, పీజీ విద్యార్థుల నుంచి రూ.49,300 చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులో కేవలం రూ. 2,800 మాత్రమే యూనివర్సిటీకి ముడుతుందని, మిగిలినదంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఫీజుల పట్టికలో పేర్కొన్న అంశాల్లో ఎన్ని సౌకర్యాలను అందిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా&
ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచాలంటే తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. సంబంధిత శాఖ ద్వారా ఫీజులు …మిగతా IV లో

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0