దైవత్వం.. విధి.. విధ్వంసం కలబోతగా

Feb 18, 2026 - 19:29
 0  0
దైవత్వం.. విధి.. విధ్వంసం కలబోతగా
Naga Bandham Movie

సంస్కృతి పరిరక్షణకై జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న పానిండియా మహాకావ్యం ‘నాగబంధం’ అని మేకర్స్‌ చెబుతున్నారు. విరాట్‌కర్ణ హీరోగా అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌ కథానాయికలు. సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.

ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన ఎక్స్‌ ఖాతా ద్వారా టీజర్‌ని లాంచ్‌ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘టీజర్‌లో నాగబంధం ప్రపంచం అద్భుతంగా ఉంది. ఈ అనుభూతిని పూర్తిగా ఎక్స్‌పీరియన్స్‌ చేయాలని ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్‌లో మహేశ్‌బాబు పేర్కొన్నారు.

ఇక టీజర్‌ విషయానికొస్తే.. అహ్మద్‌షా అబ్దాలి నేతృత్వంలో జరిగిన ఆఫ్ఘాన్‌ దాడి నుంచి కొంత ప్రేరణ పొంది తయారు చేసుకున్న కథ ఇదని టీజర్‌ చెబుతున్నది. మైథాలజీ, చరిత్ర, ఆధ్యాత్మిక మేళవింపుగా, దైవత్వం.. విధి.. విధ్వంసం కలబోతగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. దర్శకుడు అభిషేక్‌ నామా గ్రాండ్‌ విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌ చెబుతున్నది.

డీవోపీ సౌందర్‌రాజన్‌ విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ ఈ టీజర్‌కి నిండుదనాన్ని తెచ్చాయి. పలు పవర్‌ఫుల్‌ అవతారాల్లో కనిపించి హీరో విరాట్‌కర్ణ టీజర్‌లో హైలైట్‌గా నిలిచారు. మహేష్‌ మంజ్రేకర్‌, జగపతిబాబు, రిషబ్‌ సావ్నీ, గరుడరామ్‌, జయప్రకాశ్‌, మురళీశర్మ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కల్యాణచక్రవర్తి, సంగీతం: జునైద్‌కుమార్‌, అభే, నిర్మాణం: NIK స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0