Watch: వాలంటైన్స్‌ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?

Feb 18, 2026 - 19:30
 0  0
Watch: వాలంటైన్స్‌ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?
Man Catches Wife With Her L

లక్నో: వాలంటైన్స్‌ డే రోజున ప్రియుడి బైక్‌పై ఉన్న భార్యను భర్త చూశాడు. వారిని అడ్డుకుని దాడి చేశాడు. ఘర్షణ నేపథ్యంలో ఆ ముగ్గురు తిట్టుకోవడంతో పాటు కొట్టుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. (man catches wife with lover) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ప్రేమికుల దినోత్సవం నాడు ప్రియుడి బైక్‌పై భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. రోడ్డుపై వారిని అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకున్నారు. ఇది చూసిన జనం అక్కడ గుమిగూడారు.

కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఆ ముగ్గురిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతికి భంగం కలిగించినందుకు మహిళ భర్త, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ముగ్గురూ రోడ్డుపై గొడవ పడిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Also Read:

Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి

teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్‌.. వాలంటైన్స్‌ డే రోజున యువకుడు ఆత్మహత్య

Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది

Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0