Watch: లోడ్‌ ట్రాక్టర్‌ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

Feb 18, 2026 - 19:30
 0  0
Watch: లోడ్‌ ట్రాక్టర్‌ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Man Narrowly Escapes Death

లక్నో: ఒక ట్రాక్టర్‌ భారీ లోడ్‌తో వెళ్తున్నది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ అందులో ఇరుక్కున్నది. ట్రాక్టర్‌పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. (Man Narrowly Escapes Death) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆగ్రాలోని వజీర్‌పూర్ ప్రాంతంలో ట్రాలీలో భారీ లోడ్‌తో ట్రాక్టర్‌ వెళ్తున్నది.

కాగా, ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో లోడ్‌ ఉన్న ట్రాలీ ఆ గోతిలో దిగబడింది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ బలంగా కుదుపులకు గురైంది. దాని ముందు ట్రైరు గాల్లోకి లేచి పడ్డాయి. దీంతో ట్రాక్టర్‌పై కూర్చొన్న ఒక వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. ట్రాక్టర్‌ టైర్ల మధ్యలో అతడు ఉన్నాడు.

మరోవైపు కుంగిన రోడ్డులో ట్రాలీ ఇరుక్కుపోవడంతో అదృష్టవశాత్తు ట్రాక్టర్ ముందుకు కదలలేదు. దీంతో ట్రాక్టర్‌ చక్రాల కింద నలిగే ప్రమాదం నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు. అతడి తలకు రోడ్డు దెబ్బ తగలడంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Also Read:

chemical factory explosion | కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్‌ హవాలా రాకెట్‌.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌

Watch: వాలంటైన్స్‌ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0