Vishwambhara | చిరంజీవి విశ్వంభర ట్రైలర్‌ ఎలా ఉండబోతుందో తెలుసా..?

Feb 18, 2026 - 19:29
 0  0
Vishwambhara | చిరంజీవి విశ్వంభర ట్రైలర్‌ ఎలా ఉండబోతుందో తెలుసా..?
Vishwambara

Vishwambhara | ఈ ఏడాది మనశంకర వరప్రసాద్‌ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్‌ చిరంజీవి (Chiranjeevi). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరు బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర (Vishwambhara). ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ర‌మ్య ప‌సుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

చాలా కాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. తాజాగా వారికి కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్‌గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్ మొగిలినేని విశ్వంభర ట్రైలర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. విశ్వంభర ట్రైలర్‌ రెడీ అయిందని.. విజువల్స్‌ తనకు స్టన్నింగ్‌గా అనిపించాయన్నాడు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన దాని కంటే పూర్తి భిన్నంగా ట్రైలర్‌, సినిమా ఉండబోతుందని చెప్పాడు. టీజర్‌పై ట్రోల్స్‌ రావడంతో మేకర్స్ ప్రస్తుతం సీజీ పోర్షన్లపై రీ వర్క్‌ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్‌.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి. విశ్వంభరలో చిరంజీవి, బాలీవుడ్‌ భామ మౌనీ రాయ్‌పై వచ్చే స్పెషల్‌ సాంగ్‌ను షూట్‌ చేశారని తెలిసిందే.

Read Also :

Couple Friendly | వాలెంటైన్స్ వీకెండ్ బాక్సాఫీస్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోరు… అదే జోడీతో మరో లవ్ స్టోరీ అనౌన్స్

Vijay – Rashmika | రష్మిక – విజయ్ పెళ్లి వార్త‌లు క్లైమాక్స్ దశకు.. హాజ‌రు కానున్న అతిథులు ఎవ‌రంటే..!

Jacqueline Fernandez | జాక్వెలిన్‌కు రూ.30 కోట్ల హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చిన సుఖేశ్!

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0