SUPER AI Academy | సూపర్ ఏఐ అకాడమీ ‘ఏఐ మహాశివరాత్రి’.. 50 నిమిషాల్లో 5,700 శివభక్తి పాటల సృష్టి..!

Feb 18, 2026 - 19:30
 0  0
SUPER AI Academy | సూపర్ ఏఐ అకాడమీ ‘ఏఐ మహాశివరాత్రి’.. 50 నిమిషాల్లో 5,700 శివభక్తి పాటల సృష్టి..!
Ai Mahashivaratri

హైదరాబాద్‌ : నగరానికి చెందిన సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy).. ఆధ్యాత్మికత, సాంకేతికతల అద్భుతమైన కలయికతో ప్రపంచంలోనే ‘మొట్టమొదటి AI మహాశివరాత్రి’గా చెప్పుకుంటున్న ‘డిజిటల్ నాద యజ్ఞం (Digital Naada Yagna)’ నిర్వహించింది. ఇందుకోసం ప్రపంచ నలుమూలల నుంచి 500 మందికి పైగా పార్టిసిపెంట్స్‌తో 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివభక్తి పాటలను రూపొందించింది.

ఈ భారీ డిజిటల్ భక్తి కార్యక్రమాన్ని జూమ్ వెబినార్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించారు. ఇందులో
పార్టిసిపెంట్స్‌ ఏకకాలంలో మహాశివుడి పాటలను రూపొందించారు. ఈ పాటల్లో లిరికల్ క్రియేషన్‌
కోసం చాట్‌జీపీటీ, కస్టమ జీపీటీ వర్క్‌ఫ్లోస్‌ను వినియోగించారు. అదేవిధంగా పాటల కూర్పు కోసం
సంగీతాన్ని పుట్టించే AI టూల్స్‌ను ఉపయోగించారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆ మహా
శివుడికి అంకితం చేసిన సామూహిక, ఆధ్యాత్మిక సమర్పణగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ‘డిజిటల్ నాద యజ్ఞం’ గా
అభివర్ణించారు. శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగోద్భవ, శక్తిమంతమైన శివ తాండవ ప్రదర్శనలతో సహా మహాదేవుని వివిధ దివ్య రూపాలకు సంబంధించిన పాటలను నిర్వాహకులు సృష్టించారు. ఈ పాటలన్నింటిని తెలుగులో రూపొందించారు. ఈ పాటలు ప్రాంతీయ భాషా భక్తి, సాంస్కృతిక వ్యక్తీకరణల బలమైన ప్రాధాన్యతను ప్రతిబింబించాయి.

కేవలం 50 నిమిషాల వ్యవధిలో ఏకంగా 5,700కు పైగా భక్తి పాటలను డాక్యుమెంట్ చేశారు. భారత్‌తోపాటు విదేశాలకు చెందిన పార్టిసిపెంట్స్‌తో అన్నింటిని సమన్వయం చేసుకుని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ భక్తి పాటలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ‘డిజిటల్ నాద యజ్ఞం’ కొనసాగింపులో భాగంగా.. 5,700కు పైగా పాటల నుంచి ఎంపిక చేసిన 108 భక్తి పాటలను రాత్రి 10:00 గంటల నుంచి తెల్లవారుజామున 1:00 గంటల వరకు మూడు గంటల ప్రత్యేక జూమ్ సెషన్‌లో ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీకాత్మక సామూహిక శ్రవణ అనుభవంగా నిర్వహకులు ప్లాన్ చేశారు.

నిర్వాహకులు ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంప నాగేశ్వర్ రావు నాయకత్వంలో, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కోశాధికారి గంప ఆదిత్య భరత్ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సూపర్ AI అకాడమీ కోర్ టీమ్‌ సభ్యులు దాస అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయశ్రీ ఈ కార్యక్రమానని సమన్వయం చేశారు. సూపర్ AI అకాడమీ వ్యవస్థాపకుడు నికేలు గుండా చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సందర్భాలలో, భక్తిలో ఏఐని ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు.

కమ్యూనిటీలలో, ముఖ్యంగా స్థానిక భాషలలో కృత్రిమ మేధస్సు విద్యను ప్రజాస్వామ్యీకరించడంపై
సూపర్ AI అకాడమీ దృష్టి పెడుతున్నది. ప్రాంతీయ భాషల్లో నూతన సాంకేతికతలను అనుసంధానం చేయడం ద్వారా అట్టడుగుస్థాయి వ్యక్తులను శక్తిమంతం చేయడం, AI అక్షరాస్యత, సృజనాత్మక సాధికారతలలో పట్టణ, ఆంగ్ల ప్రేక్షకులకు ధీటుగా వారిని తయారు చేయడం సూపర్ ఏఐ అకాడమీ లక్ష్యంగా తెలుస్తున్నది.

ఖండాంతరాలకు విస్తరించిన భాగస్వామ్యంతో కేవలం గంటలోపు 5,700 తెలుగు భక్తి పాటలను రూపొందించిన ఈ ‘AI మహా శివరాత్రి-2026’ కార్యక్రమం.. కృత్రిమ మేధస్సు, ప్రాంతీయ భాషా
వ్యక్తీకరణ, సామూహిక ఆధ్యాత్మిక బాధ్యతల కలయికలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తున్నది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0