Nikhil | ‘స్వయంభూ’ టీజర్‌పై చర్చ రగిలించిన నిఖిల్ పోస్ట్ .. ఎవ‌రిని ఉద్దేశించి ఆ కామెంట్ చేశాడు

Feb 18, 2026 - 19:30
 0  0
Nikhil | ‘స్వయంభూ’ టీజర్‌పై చర్చ రగిలించిన నిఖిల్ పోస్ట్ .. ఎవ‌రిని ఉద్దేశించి ఆ కామెంట్ చేశాడు
Nikhil

Nikhil | టాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే టీజర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మరో అంశం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీజర్‌ను HDR క్వాలిటీలో మళ్లీ అప్‌లోడ్ చేసిన సందర్భంగా నిఖిల్ చేసిన ఒక కామెంట్ చర్చకు దారితీసింది.

యూట్యూబ్ గ్లిట్జ్‌ల వల్ల టీజర్‌ను మళ్లీ అప్‌లోడ్ చేశాం అని పేర్కొన్న ఆయన, చివర్లో “రీసెంట్‌గా వచ్చిన ఒక సినిమాలా మా చిత్రంలో ఎలాంటి AI వినియోగించలేదు అని స్పష్టంగా చెప్పడం విశేషంగా మారింది. ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారనే దానిపై నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ, AI టూల్స్ వినియోగంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో “నిఖిల్ ఏ సినిమాను టార్గెట్ చేశాడు?” అన్న ప్రశ్న సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన కామెంట్ అయినా, ఇది ఇండస్ట్రీలో టెక్నాలజీ వినియోగంపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేసింది. కొందరు నిఖిల్ పారదర్శకతను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇది అవసరం లేని పోలిక అని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీజర్ కంటే ఎక్కువగా నిఖిల్ చేసిన ఈ AI వ్యాఖ్యే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.‘స్వయంభూ’ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిన వేళ, ఈ వివాదం కూడా చిత్రానికి అదనపు ప్రచారం తీసుకువచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శకబృందం మాత్రం కంటెంట్ క్వాలిటీ, విజువల్ గ్రాండియర్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0