Maha Shivaratri | మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

హైదరాబాద్ : మహాశివరాత్రి (Maha Shivaratri)సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట, ఝరాసంగం, వేములవాడ రాజన్న, కీసర, కాళేశ్వరం, వరంగల్ వేయిస్తంబాల ఆలయాల్లో ‘ఓం నమఃశివాయ’ స్మరణతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని శైవ క్షేత్రాలకు భక్తులు క్యూకట్టారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు నిండిపోయాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0