Jowar Roti | రోజూ జొన్న రొట్టెల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Feb 18, 2026 - 19:29
 0  0
Jowar Roti | రోజూ జొన్న రొట్టెల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?
Jowar Roti

Jowar Roti | మ‌న‌లో చాలా మంది భోజ‌నంలో అన్నంతో పాటు రోటీ, ప‌రాఠా లేదా నాన్ వంటి వాటిని కూడా క‌లిపి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా భోజ‌నం చేయ‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. కొంద‌రు ఈ రోటీ, ప‌రాఠా వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఉంటారు. వీటిని ఎక్కువ‌గా గోధుమ‌ల‌తో త‌యారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ రావ‌డంతో చాలా మంది ఎక్కువ‌గా చిరుధాన్యాల‌తో త‌యారు చేసిన రోటీల‌ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా జొన్న‌ల‌తో త‌యారు చేసిన రొట్టెల‌ను తీసుకుంటున్నారు. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా అంద‌రూ జొన్న రొట్టెల‌నే తీసుకునే వారు. జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌వ‌డంతో ప్ర‌జ‌లు మ‌ర‌లా జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం ప్రారంభించారు.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు..

గోధుమ రొట్టెల‌కు బదులుగా జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. గోధుమ రొట్టెల‌కు బ‌దులుగా జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న‌లు గ్లూటెన్ ర‌హితంగా ఉంటాయి. క‌నుక గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వారు జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం ఎంతో మేలుగా ఉంటుంది. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆహారంలో జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీనిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. చిరుతిండి తినాల‌నే కోరిక త‌గ్గుతుంది. ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. ఆహారాన్ని తక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది.

డ‌యాబెటిస్ ఉంటే..

ఇక జొన్న రొట్టెలు పొట్ట‌కు తేలిక‌గా ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత పొట్ట బ‌రువుగా, ఉబ్బ‌రంగా ఉండేవారు జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. జొన్న‌ల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌వ్య‌వ‌స్థలో ఉండే అసౌక‌ర్యాన్ని త‌గ్గిస్తుంది. దీనిని ప‌ప్పు, కూర‌ల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌కు ప్ర‌శాంతంగా ఉంటుంది. గోధుమ‌లు, బియ్యంతో పోలిస్తే జొన్న‌లు త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జొన్న రొట్టెలు నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతాయి. క‌నుక శ‌క్తి నెమ్మ‌దిగా విడుద‌ల అవుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల్లో వ‌చ్చే హెచ్చుత‌గ్గులు రాకుండా ఉంటాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం మంచిది.

వాపులు, మంట‌ల‌కు..

ఇక జొన్న‌ల్లో టానిన్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు, ఫైటోస్టెరాల్స్, పోలికోస‌నోల్స్ వంటి ఫైటోకెమిక‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే న‌ష్టాన్ని త‌గ్గిస్తాయి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపు, మంట వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవకాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. ఇలా అనేక ర‌కాలుగా జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయని గోధ‌మ రొట్టెల‌కు బ‌దులుగా జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని పోష‌కాహార‌ నిపుణులు చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0