IND vs PAK | అర్ధ శతకంతో చెలరేగిన ఇషాన్.. పాక్‌ ముందు భారీ లక్ష్యం..!

Feb 18, 2026 - 19:30
 0  0
IND vs PAK | అర్ధ శతకంతో చెలరేగిన ఇషాన్.. పాక్‌ ముందు భారీ లక్ష్యం..!
Ishan Surya

IND vs PAK : ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బౌలర్లను ఉతికేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) పాకిస్థాన్‌పై రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ(0) తొలి ఓవర్లోనే ఔటైనా.. విధ్వంసక ఆటతో విరుచుకుపడిన ఇషాన్ బౌండరీలతో శివాలెత్తిపోయాడు. మెరుపు అర్ధ శతకంతో శుభారంభమిచ్చిన ఇషాన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(32), తిలక్ వర్మ(25)లు సమయోచితంగా ఆడారు. ఆఖర్లో శివం దూబే(27), రింకూ సింగ్(11 నాటౌట్) మెరుపులతో టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

మహా శివరాత్రి పండుగ రోజే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ల. క్రీడాభిమానులకు కిక్ ఇచ్చే బ్యాటింగ్‌తో ఓపెనర్ ఇషాన్ కిషన్‌(77) చెలరేగాడు. వ్యూహాత్మకంగా తొలి ఓవర్ వేసిన సల్మాన్ అఘా.. చివరి బంతికి అభిషేక్ శర్మ(0) వికెట్ సాధించాడు. ఒక్క పరుగుకే డేంజరస్ అభిషేక్‌ వికెట్ పడడంతో సంబురాల్లో మునిగిన పాక్ జట్టుకు షాకిస్తూ ఇషాన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్.. బౌండరీలతో హోరెత్తిస్తూ స్కోర్ బోర్డును ఉరికించాడు. సీనియర్ షాహీన్ అఫ్రిదికి 6, 4 తో స్వాగతం పలికిన ఈ చిచ్చరపిడుగు.. ఆయూబ్ వేసిన ఆరో ఓవర్లో ఈ డాషింగ్ బ్యాటర్ రెండు ఫోర్లతో స్కోర్ 50 దాటించాడు.

హ్యాట్రిక్ ఫోర్లతో

పవర్ ప్లే అనంతరం అబ్రార్ అహ్మద్‌కు చుక్కలు చూపిస్తూ హ్యాట్రిక్ ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్‌లో తిలక్ వర్మ(25) ఉన్నాడు. రెండో వికెట్‌కు 87 రన్స్ జోడించిన ఇషాన్‌ను అయూబ్ బౌల్డ్ చేసి పాక్‌కు బ్రేకిచ్చాడు. 10 ఓవర్లకు 92 పరుగులతో.. పటిష్టంగా ఉన్న టీమిండియాను కట్టడి చేసేందుకు పాక్ సారథి నలుగురు స్పిన్నర్లను దింపాడు. దాంతో, సూరయకుమార్ యాదవ్‌(32), తిలక్ ఆచితూచి ఆడారు. అయితే..15వ ఓవర్లో సయీం రెండు వికెట్లు తీయడంతో స్కోర్ నెమ్మదించింది.

పెద్ద షాట్ ఆడాలనుకున్న తిలక్‌ను బోల్తా కొట్టించిన సయీం.. ఆ తర్వాతి బంతికే బిగ్ షాట్ ఆడిన హార్దిక్ పాండ్యా(0)ను వెనక్కి పంపాడు. బాబర్ చేతికి చిక్కాడు. తదుపరి తారీఖ్ ఓవర్లో రన్సే రావడంతో సూర్య.. అబ్రార్ ఓవర్లో బౌండరీ రాబట్టాడు. శివం దూబే(27) సిక్సర్‌తో 14 రన్స్ రాగా.. స్కోర్ 150 దాటింది. తారీక్ తన చివరి ఓవర్లో సూర్యను ఔట్ చేసి సంబురాలు చేసుకున్నాడు. ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దూబే బౌండరీ.. రింకూ సింగ్(11 నాటౌట్).. వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. ఐదో బంతికిరెండో రన్‌కు యత్నించి దూబే రనౌటయ్యాడు. చివరి బంతికి.. అక్షర్ పటేల్(0) సైతం క్యాచ్‌ ఇచ్చేయగా.. టీమిండియా 7 వికెట్ల నష్టానికి 175కు పరిమితమైంది. పాక్ బౌలర్లలో రాణించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0