Congress Attack | భువనగిరిలో కాంగ్రెస్ అరాచకం .. ఓట్లు వేయలేదని బీరు సీసాలతో ఇళ్లపై దాడి

Feb 18, 2026 - 19:30
 0  0
Congress Attack | భువనగిరిలో కాంగ్రెస్ అరాచకం .. ఓట్లు వేయలేదని బీరు సీసాలతో ఇళ్లపై దాడి
Padmashali Protests 1

యాదాద్రి భువనగిరి : మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న కక్షతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు గుండాలు అరాచకానికి పాల్పడ్డారు. భువనగిరి ( Bhuvanagiri ) పట్టణంలోని ఒకట వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి పలబోజు స్వరూపరాణి ఓటమి జీర్ణించుకోలేక పద్మశాలీ( Padmasali ) కులస్తుల ఇండ్ల పై ఖాళీ బీరు సీసాలతో దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.

ఓటర్లను ఆకర్షించేందుకు పంచిపెట్టిన చీరలు, హాట్ బాక్స్ లను రోడ్డు మీద వేసి నిరసన తెలిపారు. కాంగ్రెస అరాచకాలు నశించాలంటూ ర్యాలీ నిర్వహించి పీఎస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దాడులకు పాల్పడ్డ వారితో ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0