Buchibabu Sana | ‘పెద్ది’ కెప్టెన్‌కు చరణ్ బ‌ర్త్‌డే విషెస్.. వైర‌ల‌వుతున్న ఫొటో

Feb 18, 2026 - 19:30
 0  0
Buchibabu Sana | ‘పెద్ది’ కెప్టెన్‌కు చరణ్ బ‌ర్త్‌డే విషెస్.. వైర‌ల‌వుతున్న ఫొటో
Buchibabu

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ (Peddi) దర్శకుడు బుచ్చిబాబు సనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. బుచ్చిబాబును తన “పెద్ది కెప్టెన్” అని సంబోధిస్తూ, ఆయన ప్యాషన్ మరియు కథపై ఆయనకున్న అంకితభావం సెట్స్‌లో ప్రతిరోజూ తమకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చరణ్ పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి చిన్న విషయంపై బుచ్చిబాబు చూపే శ్రద్ధ అద్భుతమని కొనియాడుతూ, ఈ ఏడాది ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడితో కలిసి ఉన్న ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0