Buchi Babu Sana | హ్యాపీ బర్త్ డే బుచ్చిబాబు.. పెద్ది ద‌ర్శ‌కుడికి చిత్ర బృందం స్పెష‌ల్ విషెస్

Feb 18, 2026 - 19:30
 0  0
Buchi Babu Sana | హ్యాపీ బర్త్ డే బుచ్చిబాబు.. పెద్ది ద‌ర్శ‌కుడికి చిత్ర బృందం స్పెష‌ల్ విషెస్
Buchibabu

Buchi Babu Sana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా సెట్స్‌లో ప్ర‌స్తుతం సందడి నెలకొంది. నేడు దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుప‌గా తాజాగా చిత్ర‌యూనిట్ కూడా అత‌డికి విషెస్ తెలుపుతూ ఒక వీడియోను పంచుకుంది.

పెద్ది బిహైండ్ ది సీన్స్ (BTS) అంటూ వీడియోను విడుద‌ల చేయ‌గా ప్ర‌స్తుతం ఈ వీడియో ఆక‌ట్టుకుంటుంది. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ రెండో చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్ పూర్తి రస్టిక్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0