Bill Gates | బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు అంతరాయం.. గన్నవరం ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు

Feb 18, 2026 - 19:29
 0  0
Bill Gates | బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు అంతరాయం.. గన్నవరం ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు
Bill Gates In Gannavaram1

Bill Gates | గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.

బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం చేరుకున్న విమానానికి పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్, జిల్లా అధికారులు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు.

Bill Gates In Gannavaram

Bill Gates In Gannavaram

ఇక అమరావతి పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో బిల్ గేట్స్ బృందం సమావేశం కానుంది. అనంతరం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని వారు సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాలను బిల్ గేట్స్‌కు చంద్రబాబు వివరించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను, వాటిని మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0