Bala Krishna | నందమూరి బాలకృష్ణకి ప్ర‌పోజ్ చేసిన యాంక‌ర్.. పువ్వుతో కొట్టిన బాల‌య్య‌.. వీడియో వైరల్

Feb 18, 2026 - 19:30
 0  0
Bala Krishna | నందమూరి బాలకృష్ణకి ప్ర‌పోజ్ చేసిన యాంక‌ర్.. పువ్వుతో కొట్టిన బాల‌య్య‌.. వీడియో వైరల్
Bala

Bala Krishna | రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థ అన్విత గ్రూప్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను నియమించింది. ఈ సందర్భంగా వాలెంటైన్స్ డే రోజున హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన ‘అన్విత బిల్డింగ్ హ్యాపినెస్’ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సినీ, వ్యాపార వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్‌లో సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను అధికారికంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడంతో హాల్ అంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, నమ్మకం, స్థిరత్వానికి ప్రతీకగా బాలయ్య ఇమేజ్ తమ బ్రాండ్‌కు సరిపోతుందని అన్విత గ్రూప్ నిర్వాహకులు తెలిపారు.

ప్రజల్లో ఉన్న ఆయన ఫాలోయింగ్, నిజాయితీ గల వ్యక్తిత్వం తమ ప్రాజెక్టులకు మరింత విశ్వసనీయతను తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేజ్‌పై యాంకరింగ్ చేస్తున్న మహిళా యాంకర్ బాలకృష్ణకు పువ్వు ఇచ్చి సరదాగా ప్రపోజ్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అనూహ్య సన్నివేశంతో హాల్ అంతా నవ్వులతో మార్మోగింది. బాలకృష్ణ కూడా చిరునవ్వుతో స్పందిస్తూ ఆ పువ్వుతో యాంక‌ర్‌ని కొట్టాడు. దీంతో ఆ వీడియో మరింతగా ట్రెండ్ అవుతోంది.

సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న బాలకృష్ణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ కొత్త బాధ్యత రావడం విశేషంగా మారింది. వ్యాపార రంగంలో సెలబ్రిటీలను బ్రాండ్ ముఖచిత్రాలుగా తీసుకోవడం సాధారణమే అయినప్పటికీ, ఈ ఈవెంట్‌లో జరిగిన సరదా ప్రపోజల్ సీన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో వేగంగా షేర్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాలలో కూడా దూసుకుపోతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0